మంచిర్యాల: పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన జెడ కిష్టయ్య అనే 36 సంవత్సరాల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మృతుడు గ్రామంలో భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండేవాడు. తను చేసే పంటల కోసం మందులను కొనుగోలు చేసాడు.