ప్రకాశం జిల్లా కంభం, గిద్దలూరు మండలాలలో మంగళవారం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కాలేజీ లను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని దీనివల్ల పేదలు విద్యా వైద్యం కోల్పోతారని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ ని కలిసి మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడానికి అడ్డుకుంటామని అన్నారు.