అదిలాబాద్ అర్బన్: పెండింగ్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని ఆదిలాబాద్ లోనిరసన వ్యక్తం చేసిన కళాశాల యాజమాన్యాలు,సిబ్బంది
గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ లో కళాశాలల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఆయా కళాశాలల యాజమాన్యం, సిబ్బంది నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి కళాశాల నిర్వాహకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... గత మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్ నిధులు పెండింగ్ లో ఉండడంతో ప్రైవేట్ విద్య సంస్థలపై పెను ఆర్థిక భారం పడుతుందన్నారు. అందుచేతనే స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు