అదిలాబాద్ అర్బన్: బేలలో యూరియా కోసం రైతుల క్యూ లైన్
బేలలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. యూరియా కోసం రైతులు బేల మండల కేంద్రంలోని కేంద్రాల వద్ద సోమవారం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి, రైతులకు తగినంత యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే, జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు