మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్గా నటిస్తూ, బోగారం పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతుని సైబర్ మోసగాడు ఆన్లైన్ లో డబ్బులు అడిగాడు. వాట్సాప్ ప్రొఫైల్, ట్రూ కాలర్ లో సీఐ కనిపించడంతో, మోసగాడు పంపిన స్కానర్ కు హనుమంతు 20,000 రూపాయలు పంపాడు. నిన్న సాయంత్రం వరకు జరిగిన ఈ మోసాన్ని గ్రహించిన మేనేజర్, తాను సైబర్ నేరగాల చేతిలో మోసపోయానని తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.