పడమరలాకులలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన కోట్ల ప్రసాద్ అనే వ్యక్తి
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు రూరల్ పరిధిలోని గ్రీన్ సిటీ కి చెందిన కోట్ల ప్రసాద్ 48 మంగళవారం పడమర లాకుల వద్దకు వెళ్ళి అతను ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. నీటి ప్రవాహానికి అతని మృతదేహం కొట్టుకుపోయి కొత్తూరు జూట్ మిల్ సమీపంలో లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు సహకారంతో స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు