మోత్కూర్: దత్తప్ప గూడెంలో నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి:BJP భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి మురళీధర్ రెడ్డి
మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. భాజపా భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి తుమ్మల మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం దత్తప్పగూడెం గ్రామంలో సిసి రోడ్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు . నాణ్యతతో కాకుండా నాసిరకగంగా వేశారని, రోడ్డు పగుళ్లు వచ్చాయని అన్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.