అనంతపురం నగరంలోని 3 టౌన్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ లో మృతి చెందిన శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని లేపాక్షి మండలంకు చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె కొడుకు నిస్సహాయ స్థితిలో ఉండడంతో విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ గారికి సహకారంగా పోలీసులు నిలిచారు. వారి గ్రామానికి కృతదేహాన్ని తరలించేందుకు మానవత్వాన్ని చాటుకున్నారు.