నారాయణపేట్: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: డి.ఎస్.పి లింగయ్య
పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని డి.ఎస్.పి లింగయ్య అన్నారు. సోమవారం నారాయణపేట లోని తన కార్యాలయంలో మక్తల్, కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.