కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం లోని కళాశాలల్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు
కళ్యాణదుర్గంలోని పలు కళాశాలలో మంగళవారం కోటి సంతకాల కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. వైయస్సార్సీపీ జిల్లా నాయకులు షేక్షావలి, తాలూకా అధ్యక్షులు ఎరుకల అజయ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల నుంచి సంతకాలను సేకరించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నదని విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు.