సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసం నందు సత్యసాయి జిల్లా టిడిపి నూతన అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి సత్య సాయి జిల్లా రాజకీయాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ టిడిపి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను కలవడం జరిగిందని రానున్న ఎన్నికల్లో 100% టిడిపి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఎమ్మెల్యేను కోరడం జరిగిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు.