అదిలాబాద్ అర్బన్: మొబైల్ ఫోన్ పోయిందా సీఈఐఆర్ లో ఫిర్యాదు చేయాలి 108 మందికి తిరుగి ఫోన్ లు అందజేసిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగని, అలాంటి ఫోన్ లు పొగుట్టుకున్న వారు నిరాశ చండవద్దని, పోయిన ఫోన్ లను రికవరీ చేయవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పడిపోయిన, దొంగలించబడ్డ ఫోన్ లను తిరిగి పొందాలంటే బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్ లో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లాలో ప్రత్యేకంగా రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశమన్నారు. గత నెల రోజుల వ్యవధిలో పోగొట్టుకున్న ఫోన్ లను ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి ఎస్పీ అందజేశారు