జగిత్యాల: ప్రజావాణిలో పెట్రోల్ డబ్బాలతో కలెక్టరేట్ ఆవరణలో గంగపుత్రుల నిరసన, అడ్డుకున్న పోలీసులు
తమకు న్యాయం చేయాలంటూ మెట్పల్లి మం. కోనరావు పేట, కొండ్రికర్ల గ్రామానికి చెందిన గంగ పుత్రులు పెట్రోల్ డబ్బాలతో ప్రజావాణి వద్ద నిరసన తెలిపారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వారిని అడ్డుకొని పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.గ్రామాల్లో చెరువులు, నీటి కుంటల పై గంగపుత్రులకు మాత్రమే హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో మెట్పల్లి మండలం కొండ్రికర్ల, కొనరావుపేట గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్ ఆవరణ లో చెరువులు కుంటల పై హక్కులను గంగపుత్రులకు మాత్రమే కల్పించాలని కోరారు.