పాణ్యం: కల్లూరు అర్బన్‌లో అయ్యప్ప స్వామి బిక్ష కార్యక్రమాల్లో పాల్గొన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు
కల్లూరు అర్బన్ 21వ వార్డు కార్పొరేటర్ అరుణ, బాలచంద్రా రెడ్డి నివాసంలో అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. అనంతరం 19వ వార్డు గణేష్ నగర్లో చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా అయ్యప్ప బిక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.