జమ్మలమడుగు: పెద్దముడియం : మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది... పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని పెద్దముడియం మండలంలో మొంథ తుఫాను వల్ల నంద్యాల జిల్లాలో కురిసిన వర్షాలకు గురువారం కుందూ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగడంతో మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం, నెమల్లదిన్నె వద్ద వంతెనలపై కుందూలో ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తోంది. వరద ధాటికి బలపనగూడూరు గ్రామాన్ని వరద చుట్టేసింది. ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబందాలు తెగి పోయాయి.నెమల్లదిన్నె, గరిశలూరు, తదితర ప్రాంతాల్లో వరిపొలాలు నీటమునిగాయి. పెద్థముడియం వంతెనపై వరద ప్రవాహం కొనసాగుతోంది.పెద్దముడియంలో పెద్దవంక,పుట్టవంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.