మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడించిన బిఆర్ఎస్ నాయకులు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీలకు సమాచారం ఇవ్వకుండా, అధికార పార్టీ నుండి ఓడిపోయిన వ్యక్తితో అధికారిక కార్యక్రమాలు చేయిస్తూ ప్రజాతీర్పును మున్సిపల్ యంత్రాంగం అపహాస్యం చేస్తుందని వారు ఆరోపించారు.