తాడిపత్రి: తల్లికి వందనం డబ్బులు పడ్డాయని ఆనందంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి చెప్పిన విద్యార్థులు
తాడిపత్రి పట్టణంలోని ప్రధాన కాలనీలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో టిడిపి నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి బయట ఉన్న విద్యార్థులతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ముచ్చటించారు. స్కూల్ కి వెళ్లి బాగా చదువుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని విద్యార్థులు ఆనందంతో ఎమ్మెల్యేకు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.