కొత్తపల్లి మండల కేంద్రంలో: ఒక మోస్తారు వర్షం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఒక మోస్తారు వర్షం కురిసింది, దీంతో కొత్తపల్లి గ్రామంలోని పలు వీధుల్లోని రహదారులు ప్రధాన రహదారులు చిత్తడి చిత్తడిగా మారాయి, మరోవైపు ఈ వర్షంతో కోతకు వచ్చిన పచ్చిమిరప ఇతర పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని మిరప మరియు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు విచారణ వ్యక్తం చేశారు.