విద్యార్థుల భవిష్యత్తు కోసమే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.చాగలమర్రి జడ్పీ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో పాల్గొని, అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి బంగారు బాటలు వేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.