అమరావతిలో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల స్వీకరణకు భీమడోలు మీదుగా బస్సుల్లో తరలివెళ్లిన అభ్యర్థులు
Eluru Urban, Eluru | Sep 25, 2025
అమరావతిలో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమానికి భీమడోలు మీదుగా పదుల సంఖ్యలో బస్సుల్లో అభ్యర్థులు తరలివెళ్తున్నారు. డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లకు అమరావతిలో గురువారం నియామక పత్రాల అందజేసే కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సుమారు మూడువేల మందికి భీమడోలు హైస్కూల్ వద్ద విద్యాశాఖ అధికారులు భోజన ఏర్పాట్లు చేసారు. భీమడోలు ఎంఈవో-2 భాస్కరకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.