సాలూరు శ్యామలాంబ పండగకు 900 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు : జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి
సాలూరు శ్యామలాంబ అమ్మవారి పండగ నిమిత్తం 900 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రణాళికబద్ధమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సాలూరు పట్టణంలో పర్యటించి పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సినిమాను ఘటాలు తిరిగే ప్రాంతాల్లో పాత భవనాలు గుర్తించి తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశించారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు తదితరవి పర్యవేక్షించారు.