ఒంగోలు రైల్వే స్టేషన్ లోరైళ్లలో విస్తృత తనిఖీలు - సుమారు 15 కేజీల గంజాయి మరియు 75 వేలు నగదు స్వాధీనం
Ongole Urban, Prakasam | Sep 15, 2025
గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, సిబ్బంది, మరియు మాదకద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్ రాక్సీ తో కలిసి సోమవారం పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.