మంత్రాలయం: కల్లుకుంట గ్రామంలో సీపీఐ ఆఫీసు ప్రారంభం ,సర్పంచ్ ఎన్నికల్లో చదువుకున్న యువత పోటీ చేయాలి: సీపీఐ నాయకులు
పెద్ద కడబూరు:కల్లుకుంట గ్రామంలో ఆదివారం సీపీఐ పార్టీ ఆఫీసును జాఫర్ పటేల్ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భార్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి చదువుకున్న యువత రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష, అంటరితనం, వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే విద్యే మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.