కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో అక్టోబర్ 6 వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు : చిత్తూరు జిల్లా కలెక్టర్
Chittoor Urban, Chittoor | Oct 2, 2025
పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని యువతలో పారిశుధ్యం పై అవగాహన కార్యక్రమాలు పెరగాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు గురువారం జిల్లా సచివాలయంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి స్వచ్ఛతకి సేవా కార్యక్రమంలో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.