గోకవరంలో అత్యాచారానికి గురైన బాధితురాలు కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకోవాలి అని PDSU డిమాండ్
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గత రోజుల క్రితం పదహారేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయంలో ప్రభుత్వం ఆర్దికపరంగా అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలని శుక్రవారం గోకవరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎమ్మార్వో సానుకూలంగా స్పందించి ఈ రిపోర్టు ఉన్నత అధికారుల దృష్టిలో పెడతామని అన్నారు.