పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన రైతు నాగలింగయ్య పురుగుల మందు తాగి గురువారం మృతి చెందిన ఘటనకు సంబంధించి శుక్రవారం ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను పోలీసులు శుక్రవారం ఉదయం అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని అసహనాన్ని వ్యక్తం చేశారు. పరామర్శించేందుకు వీలు లేకుండా మృతదేహాన్ని పంపించడం పై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.