ఇబ్రహీంపట్నం: లింగోజిగూడ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
లింగోజిగూడ డివిజన్లోని మైత్రి నగర్ లో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. లింగోజిగూడ డివిజన్లో అభివృద్ధి ఎప్పుడూ ఆగదని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.