జగిత్యాల: ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఉత్తమ విద్యార్థులుగా ఎదిగి జిల్లా నర్సింగ్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి..జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై IMA హాల్ లో మంగళవారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎస్పి విద్యార్థులను ప్రశ్నలు అడిగి ర్యాగింగ్ వల్ల కలిగే పరిణామాలపై అవగాహనను పరీక్షించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్...