అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో వాహన డ్రైవర్ పై 20 మంది విచక్షణారహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
జేఎన్టీయూ వాహన డ్రైవర్ శంకర్ పై 20 మంది విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సుశాంత్ కుమార్ అనే చిన్నారి పై దాడి చేయడంతో దాడి చేసిన వారిని ప్రశ్నించిన నేపథ్యంలో ఒక్కసారిగా అతనిపై 20 మంది దాడి చేశారు. రక్తపు గాయాలైన అతనిని అనంతపురం ప్రభుత్వ సరోజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.