కుప్పం: తిరుపతిలో చోరీ.. కుప్పంలో రికవరీ
తిరుపతిలో జరిగిన ఓ భారీ చోరీకి సంబంధించి కుప్పం ప్రాంతానికి చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడల్ కాలనీకి చెందిన వినోద్ భార్య నందిని, రాజీవ్ కాలనీకి చెందిన పార్థిబన్ భార్య జ్యోతి, శాంతి లేఔట్ లో నివాసం ఉంటున్న అరుణ్‌ను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి 410గ్రా. బంగారు ఆభరణాల రికవరీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.