ఝరికోన నీటిలో తేలిన గుర్తు తెలియని మగ శవం.. గుర్తిస్తే తెలపాలన్న ఎస్ఐ
కలకడ మండలం బాలయ్య గారి పల్లి పంచాయతీ లోని ఝరి కోన నీటిలో ఒక గుర్తు తెలియని మగ శవము పడి ఉన్నట్లు అందిన సమాచారంతో ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో వెళ్లి నీటిలో పడి ఉన్న శవాన్ని పరిశీలించి బయటకు తీయించారు. సుమారు 45సం. వయస్సు కలిగిన మగ శవము సుమారు రెండు రోజుల క్రితం నుండి నీటిలో ఉండినట్లు తెలుస్తున్నదని అన్నారు. మృతుడి శరీరం మీద ఫుల్ హ్యాండ్ షర్ట్ లైట్ గ్రీన్ మరియు పసుపు కలరు గీతలు కలిగి ఉండినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ గుర్తిస్తే కలకడ సీఐ సెల్ నంబర్ 8712626239, లేదా కలకడ ఎస్ఐ సెల్ నెంబరు 9440796713 కి సమాచారం ఇవ్వాలని కోరారు.