గుంతకల్లు పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.