పులివెందుల: దొండ్లవాగులో విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి
Pulivendla, YSR | Oct 29, 2025 కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని లింగాల మండలం దొండ్లవాగు లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షాక్ తో వెంకట రాములు అనే వ్యక్తి మృతి చెందాడు ఇంట్లో స్విచ్ బోర్డుకు మరమ్మత్తులు చేస్తూ ఉండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు లింగాల ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.