అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి వద్ద హెర్మోన్ సిటీ నందు నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించకూడదని ఎమ్మార్పీఎస్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ బండారు కుల్లాయప్ప బీసీ సంక్షేమ సంఘం రామలింగ ఎంఆర్పిఎస్ సీనా తదితరులు మాట్లాడుతూ అనంతపురంలో ఎప్పుడు లేని విధంగా నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించేందుకు హార్మోన్ సిటీ నందు ఏర్పాటు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇలాంటి కార్యక్రమాల వల్ల యువకులు చెడిపోయే అవకాశం ఉందని అందుకే అడ్డుకుంటామని ఎంఆర్పిఎస్ బీసీ నేతలు పేర్కొన్నారు.