అనంతపురం నగరంలోని రాంనగర్ లో త్రివేణి హోమ్స్ అనే అపార్ట్మెంట్లో తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన మొహమ్మద్ అమీర్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానిక గాలి మరల కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తోటి స్నేహితులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని మంగళవారం రాత్రి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.