సిరిసిల్ల: రెడ్డి కార్పొరేషన్‌ను CM రేవంత్ రెడ్డి అమలు చేయడంపై టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న జిల్లా రెడ్డి సంఘం నేతలు
సిరిసిల్ల పట్టణంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ యావత్ తెలంగాణ రెడ్డి కులస్తులు అందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నమైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు, సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో బిల్లు ప్రవేశ పెట్టారన్నారు. ఇది యావత్ తెలంగాణ రెడ్డి కులస్థులందరికీ మంచి రోజు అని అన్నారు.