మై భారత్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యత ర్యాలీ లో భాగంగా జిల్లాస్థాయి యూనిటీ మార్చి కార్యక్రమాన్ని నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి 3 కిలోమీటర్ల మేర విద్యార్థులతో జాతీయ జెండాలతో యూనిటీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్పందన హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పి సీఈవో చిరంజీవి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ తదితరులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.