ప్రకాశం జిల్లా వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ని మంగళవారం కనిగిరి సర్కిల్ సీఐ శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని క్రైమ్ రికార్డులను పరిశీలించి స్థానిక పరిస్థితులను ఎస్ఐ కృష్ణ పావనితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ సూచించారు. తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి భోజనం చేయడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.