మార్కాపురం: జ్వరాల బారిన పడకుండా ముందస్తుగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపిన డాక్టర్ శరత్ చంద్ర
ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని లక్కి శెట్టిపాలెంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వరాల బారిన పడకుండా ముందస్తుగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు కొన్ని కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని కాల్చి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, దోమల కుట్టకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రతి చోట వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.