నారాయణ్‌ఖేడ్: మూడు గుంటల్ నుండి సంజీవనరావుపేట్, కడపల్, సిర్గాపూర్, చాప్ట రోడ్డు విస్తరణకు 21 కోట్లు మంజూరు : బిజెపి వైస్ ప్రెసిడెంట్
నారాయణఖేడ్‌లోని మూడు గుంటల నుంచి సిర్గాపూర్ వయా చాప్ట వరకు రోడ్డు మంజూరు కావడం సుభశుచుకం అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ.. మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బండి సంజయ్ సహకారంతో, కేంద్ర రోడ్ల ఇన్చార్జి మంత్రి నితిన్ గడ్కరీ కృషి అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు బిజెపి అగ్ర నేతలు హామీ ఇచ్చారని ఇప్పుడు అమలు చేశారని అన్నారు. రోడ్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బిజెపి ప్రత్యేక నిఘా పెట్టిందని అన్నారు.