అక్రమ లే అవుట్ పై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తాం: కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జైకిసాన్ పార్కులో మంగళవారం మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బందితో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు, పెద్ద ప్రభుత్వం అక్రమ వెంచర్ల ద్వారా కూడాను నాశనం చేశారని, దీని వెనకాల ఎంతటి బడా నాయకుడు ఉన్నా సహించబోమని స్పష్టం చేశారు, గత ఐదేళ్లలో జరిగిన తప్పులపై విచారణ జరుపుతామని, ప్రభుత్వ సొమ్మును దుర్వినిగం చేసిన వారిని వదిలిపెట్ట బొమ్మని వారి అందరి నుంచి ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబడతామని అన్నారు.