ఇబ్రహీంపట్నం: బియన్ రెడ్డి నగర్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
రంగారెడ్డి జిల్లా బి. ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పార్కు అభివృద్ధి కోసం రూ.15.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా బుధవారం కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి బోరు మోటర్ పనులను ప్రారంభించారు డివిజన్లోని ఒక్కొక్కటిగా ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.