మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు డీఎన్ఆర్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఏలూరు పోలీస్ సంఘం నాయకులు
Eluru Urban, Eluru | Sep 29, 2025
ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు సంక్షేమ సంఘం నాయకులు సోమవారం సాయంత్రం 4గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కైకలూరు టౌన్ దానగూడెంలో జరిగిన ఘటనపై కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనదని పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంటనే ఈ వ్యాఖ్యలపై డిఎన్ఆర్ స్పందించి ఏలూరు జిల్లా పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏలూరు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి రాజకీయ నాయకులు దూలం నాగేశ్వరరావు పోలీసుల ఆత్మస్టైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదనన్నారు.