పులివెందుల: ప్రభుత్వం వద్ద డబ్బు లేనందువల్ల వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేశామనడం సాకు మాత్రమే : కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి
Pulivendla, YSR | Oct 25, 2025 రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేనందువల్ల పులివెందులతో సహా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. శనివారం వేంపల్లి లో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం సాకు మాత్రమే అన్నారు.  కుక్కలు చెప్పులు వెతుకును ,నక్కలు బొక్కలు వెతుకును, కూటమి నాయకులు సాకులు వెతుకును సుమతి అన్నట్లు ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.