ఎమ్మెల్యే హెచ్చరించినా మారని తీరు,మిడుతూరు సిహెచ్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయడం లేదని గర్భవతులు ఆవేదన
మేము గర్భవతులం గర్భంలో పిండం సరిగ్గా ఉందో లేదోనని స్కానింగ్ కొరకు మిడుతూరు సిహెచ్ సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం)ఆస్పత్రికి వెళ్తే మాకు స్కానింగ్ చేయడం లేదు ఇక్కడ చేయం బయట హాస్పిటల్లోకి వెళ్లి చేయించు కోండంటూ డాక్టర్ అంటూ ఉన్నారని గర్భవతులు తమ ఆవేదనను వెళ్ళగక్కారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల గర్భవతులు ముస్కాన్, మౌలాబి,సబియా,ఆస్మా,ఖైరుణ్ బి,ఫాతిమాభి,సమీనా తదితర గర్భవతులు డాక్టర్లపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్థానిక ఆసుపత్రిలో గత నెలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్వయంగా స్కానింగ్ చేయడం లేదని మహిళలు విన్న