కర్నూలు: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి: కర్నూలు లో సిఐటీయు నేతలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు లో సీఐటీయూ ధర్నా చేపట్టారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు సిటీ ఆధ్వర్యంలో జోహారాపురంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఓల్డ్ సిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సి.నాగరాజు మాట్లాడుతూ.. కార్మికుల పోరాట ఫలితంగా ఏర్పడిన సంక్షేమ బోర్డును గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. కార్మికుల చెస్ నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు.