పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Oct 21, 2025
ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, నాగులుప్పపాడు పోలీస్ స్టేషన్లను మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పరిశీలించి దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టే అంశంలో పోలీసు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తర్వాత పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు పోలీసు సిబ్బంది కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.