సత్తుపల్లి: ఖమ్మం జిల్లా తల్లాడ లోని ఘనంగా విరాట్ విశ్వ కర్మ జయంతి వేడుకలు
ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం.తల్లాడ మండల కేంద్రంలో బుధవారం విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము నందు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆస్థాన పండితులు రామడుగు నరసింహచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి విశ్వకర్మ చిత్రపటాన్ని ఉంచి పూజలు జరిపారు.అంతకుముందు మండల విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు రుద్రాక్ష నరసింహ చారి అధ్యక్షతన కోలాటం నృత్యాలతో స్థానిక విశ్వకర్మలు తల్లాడ మండల కేంద్రంలోని రింగ్‌రోడ్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించి అకండ జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మ మహా కళాశా స్థాపన,పంచామృతబిషేకం నిర్వహించారు.