మచిలీపట్నం: నగరంలోని రెవెన్యూ ఫంక్షన్ హాల్‌లో కలెక్టరేట్ ఉద్యోగులకు నిర్వహించిన యోగ శిక్షణా తరగతులను ప్రారంభించిన కలెక్టర్ DK బాలాజీ
మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగ సభ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉద్యోగులకు స్థానిక రెవెన్యూ ఫంక్షన్ హాలులో మంగళవారం ఉదయం 7గంటల సమయంలో నిర్వహించిన యోగ శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగా ఆవశ్యకతను వివరించారు.