ప్రకాశం జిల్లా మర్రిపూడి పోలీస్ స్టేషన్ ని డీఎస్పీ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైమ్ రిపోర్ట్ పరిశీలించడంతోపాటు స్థానిక పరిస్థితులపై అరా తీశారు. దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టే అంశంలో తీసుకోవలసిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి సూచించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చే యజమానులపై కఠిన చర్యలు తీసుకొని భారీ జరిమానాలు విధించాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. ఇక సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించమని తెలిపారు.